ఇన్వెస్టర్లకు షాక్.. పతనమైన సెన్సెక్స్

18-11-2026 | 04:36pm

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో(Indian Stock Market) మళ్లీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడటంతో బుధవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్(BSE Sensex) 500.38 పాయింట్లు (0.61 శాతం) క్షీణించి 82,031.81 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty 50) 159.45 పాయింట్లు (0.63 శాతం) నష్టపోయి 25,227.95 వద్ద ముగిసింది.

మెటల్, ఆటో, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లలో అమ్మకాల ప్రభావం మార్కెట్లపై పడింది. ముఖ్యంగా టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఎస్‌బీఐ, ఐటీసీ, సిప్లా షేర్లు కొంత మేర లాభాల్లో ముగిశాయి. వరుస లాభాల తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం కూడా సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో రోజంతా ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్ చివరకు నష్టాలతో ముగిసింది.

మరిన్ని వార్తలు