డాలర్‌పై రూపాయి పైచేయి
పడిపోయిన క్రూడ్ ధరలు.. పుంజుకున్న రూపాయి విలువ!
ముంబై, నవంబర్ 18: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి(Rupee vs US Dollar) విలువ పుంజుకుంది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 24 పైసలు బలపడి 93.27 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు భారీగా రావడం రూపాయికి మద్దతుగా నిలిచాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు రాత్రికి రాత్రే గణనీయంగా తగ్గడంతో భారత్ దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గే అవకాశం ఉందని Forex Market నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు ఈ నెలలో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్లలోకి 8 బిలియన్ డాలర్లకు పైగా Foreign Portfolio Investments (FPI) రావడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచింది. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించడంతో రూపాయికి మరింత బలం చేకూరింది. క్రూడ్ ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఇలాగే కొనసాగితే రూపాయి విలువకు మరింత మద్దతు లభించే అవకాశముంది.