బోడులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

26-10-2026 | 05:56pm

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామంలో సోమవారం వాల్మీకి జయంతి(Valmiki Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలను, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సంస్కృతి, ధర్మం, మానవీయ విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. గ్రామంలో చిత్రపటాన్ని ఊరేగించి అనంతరం పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు, వాల్మీకి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు