కొడిశెలగూడెంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించిన ఎమ్మెల్యే జారె

25-09-2026 | 04:49pm

దమ్మపేట, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): కొడిశెలగూడెం గ్రామస్తుల విన్నపంపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి సాధ్యాసాధ్యాల పరిశీలన చేశారు. పంటపొలాల మీదుగా సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ కాలువ(Sitarama Project Link Canal)  వెళ్లడం వల్ల కాలువ అవతలి వైపు ఉన్న తమ పొలాల్లోకి వెళ్లడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు ప్రాజెక్ట్ ఉన్నతాధికారులతో కలిసి కొడిశెలగూడెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. కెనాల్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బ్రిడ్జ్ నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు.

మరిన్ని వార్తలు