సమతుల ఆహారంతో వ్యాధులు దూరం

25-09-2026 | 05:27pm

అంగన్వాడి సూపర్వైజర్ ఎన్ రాజ్యలక్ష్మి

నేరేడుచర్ల,సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): గర్భవతులు,బాలింతలు,మహిళలు, పిల్లలు, ఇలా అన్ని వయసుల వారు పోషకాహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల వ్యాధులకు గురికాకుండా ఉండవచ్చని అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ రాజలక్ష్మి(Anganwadi Supervisor N. Rajalakshmi) అన్నారు.పోషణ మాసంలో భాగంగా నేరేడుచర్ల -5 వ అంగన్వాడి కేంద్రంలో ప్రీస్కూల్ కార్యక్రమాలపై అవగాహన సందర్బంగా ఆమె మాట్లాడుతూ...5 సంవత్సరాలలోపు పిల్లలకు మెదడు ఎదుగుదల మరియు శరీర ఎదుగుదల ఈ వయసులో ఎక్కువగా ఉంటుందని,కాబట్టి  పిల్లలకి పోషకాహారాన్ని ఎక్కువగా ఇవ్వాలని ,ప్రత్యేక శ్రద్ధ అవసరమని,పోషకాహార ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో గర్భవతులు ,బాలింతలు తల్లులు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు