మట్టి నమూనా సేకరణపై విద్యార్థులకు అవగాహన

25-09-2026 | 05:30pm

గజ్వేల్, సెప్టెంబర్ 25: ముట్రాజ్‌పల్లి టీజీఎంఎస్ పాఠశాలలో(Mutrajpalli TGMS School) విద్యార్థులకు మట్టి నమూనా సేకరణ, మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు శ్రీనివాస్, శైలజ మట్టి నమూనాలను సేకరించే విధానం, మట్టి పరీక్షల ద్వారా భూమిలోని పోషకాల స్థాయిని తెలుసుకోవడం, పంటలకు అవసరమైన ఎరువులను సమతుల్యంగా వినియోగించడం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జె. వెన్నెసా, ఏఈఓ రమాదేవి, సచిన్, సైన్స్ ఉపాధ్యాయులు శశికళ, ప్రేమలత, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు