అనంత్‌జీత్-పరీనాజ్ జోడి సూపర్

24-09-2026 | 01:49pm

ఆసియా క్రీడలు 2026లో భారత షూటింగ్ బృందానికి మరో పతకం దక్కింది. అనంత్‌జీత్ సింగ్ నరుకా–పరీనాజ్ ధాలివాల్ జోడీ మిక్స్‌డ్ టీమ్ స్కీట్(Anantjeet Singh Naruka Parinaaz Dhaliwal Asian Games 2026) విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో స్కీట్ షూటింగ్‌లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో భారత జోడీ 44 హిట్స్ నమోదు చేసింది. చైనా 52 స్కోర్‌తో స్వర్ణాన్ని దక్కించుకోగా, దక్షిణ కొరియా 51 స్కోర్‌తో రజతం(Asian Games 2026 India shooting bronze) సాధించింది. భారత జోడీ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో అనంత్‌జీత్, పరీనాజ్ ఇద్దరి ఖాతాల్లోనూ రెండో పతకం చేరింది. అంతకుముందు అనంత్‌జీత్ పురుషుల టీమ్ స్కీట్‌లో, పరీనాజ్ మహిళల టీమ్ స్కీట్‌లో కాంస్య పతకాలు సాధించారు. మిక్స్‌డ్ టీమ్ పోటీకి ముందు భారత జోడీ క్వాలిఫికేషన్‌లో 138/150 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

మరిన్ని వార్తలు