తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు

25-09-2026 | 05:21pm

అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే 

ముకరంపుర, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి)జిల్లా ప్రజలకు తాగనీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే(Additional Collector Ashwini Tanaji Wakade) సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్(Collectorate Conference) హాలులో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ మిషన్, భూగర్భజలాలు, తాగునీటి నిర్వహణ, క్లోరినేషన్ తదితర అంశాలపై చర్చించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలతో పాటు  అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఇళ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వడంతోపాటు విధిగా ఓహెచ్ఎస్ క్లీనింగ్ చేపట్టాలన్నారు.

అంగన్వాడీలు, రైతు వేదికలు, ప్రభుత్వాసుపత్రులకు నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.అలాగే వీ బీజీ రాంజీ పథకం కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారుల తో సమన్వయం చేసుకొని ఫారం ఫండ్స్, ఇంకుడు గుంతల తవ్వకం పనులు చేపట్టడంతో పాటు బోర్ వెల్ రీఛార్జి పనులు చేయించాలన్నారు.ఈ సమావేశంలో  ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, డీఈవో చైతన్య జైనీ, డిఎంహెచ్వో రాజగోపాల్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు