ఎన్ఐటి లో సీట్ సాధించిన గురుకుల విద్యార్థినీ....

25-09-2026 | 05:29pm

తాడ్వాయి,సెప్టెంబర్,25( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలకు(Girls boarding school) చెందిన బీరకాయల రక్షిత(Ridge Gourd Raksitha) ఎన్ ఐ టి లో సీటు సాధించినట్లు ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. విద్యార్థిని రక్షిత ఐఐటి ఎంట్రెన్స్(IIT Entrance) ద్వారా ఈ సీటును సాధించినట్లు ఆమె తెలిపారు. వరంగల్ ఎన్ఐటి కళాశాలకు(NIT Warangal College) విద్యార్థిని ఎంపిక కావడం పట్ల గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు రావడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు