చెన్నాయిపాలెం రేషన్ డీలర్‌పై సస్పెన్షన్ వేటు
25-09-2026 | 05:24pm
మఠంపల్లి సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): మఠంపల్లి మండలం చెన్నాయి పాలెం గ్రామ(Chennayi Palem village) రేషన్ డీలర్‌ను సస్పెండ్ చేస్తూ హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు(Huzurnagar RDO Srinivasulu) ఉత్తర్వులు జారీ చేశారు.చెన్నాయిపాలెం డీలర్ భూక్యా అనితా కు పెళ్లి కావడం వల్ల గ్రామంలో స్థానికంగా ఉండడం లేదని ఫిర్యాదు చేశారు.విచారణ చేసి సస్పెన్స్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం డీలర్ సస్పెన్షన్ నేపథ్యంలో ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బాధ్యతలను వడిత్య శ్రీను కు అప్పగించారు.ఆర్డీవో ఆదేశాల మేరకు వడిత్య శ్రీను ఇకపై చెన్నాయి పాలెం రేషన్ దుకాణం నిర్వహణ బాధ్యతలను అదనంగా చేపట్టనున్నారు.రేషన్ సరుకుల పంపిణీని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు సూచించారు.