భిక్కనూర్‌లో అన్నదాన కార్యక్రమం

25-09-2026 | 07:50pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 25 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ పాత హరిజనవాడలో(Bhikkanur Old Harijan Colony) అంబేద్కర్‌ యువజన సంఘం(Ambedkar Youth Association) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రుల మండపం(Ganapati Navaratri Mandapam) వద్ద కౌసల్యా దేవి ఫౌండేషన్‌(Kausalya Devi Foundation) (కేడీఎఫ్‌) ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం(Food Donation Program) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు 14వ వార్డు మెంబర్‌, కౌసల్య దేవి ఫౌండర్‌ పెద్దబచ్చగారి జ్ఞాన ప్రకాష్‌రెడ్డి తెలిపారు. గణేష్‌ నవరాత్రుల సందర్భంగా భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు