ఆదివాసీల ఆశజ్యోతి కొమరం భీమ్ కు ఘన నివాళులు
లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కొమరం భీమ్(Komaram Bheem) ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆదివాసి గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తామని ఆదివాసి నాయకుల స్పష్టం చేశారు. కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రం కొమరం భీమ్ సర్కిల్ (ఇల్లందు క్రాస్)నందు ఉన్న కొమరం భీం విగ్రహానికి ఆదివాసి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ కొమరం భీమ్ నిజాం సర్కార్ పై జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసులకు భూమిపై అడవిపై నీటిపై హక్కు ఉందని నిజాం సర్కార్ పై వీరోచిత పోరాటం చేసి సాధించిన వీరుడు ఆదివాసి ముద్దుబిడ్డ గోoడు బెబ్బిలి కొమరం భీమ్ 86వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించారు. కొమరం భీమ్ అడవి పై హక్కుల కోసం ఆదివాసీలకు అన్ని హక్కులు అందాలని పోరాటం చేసాడని ఆనాడు కొమరం భీమ్ పోరాట ఫలితమే నేడు ఆదివాసి తరాలకు అందుతుందని ఫలాలు అన్నారు.
కొమరం బీమ్ కు గుర్తిపు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తనంగా జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాయం లక్ష్మీనర్సు (తుడుం దెబ్బ జిల్లా కార్యదర్షి) బట్టు కనకరాజు (సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి) వర్షా నరసింహారావు (తుడుం దెబ్బలక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు) తాటి పుల్లయ్య (జిల్లా నాయకులు) గుమ్మడిశెట్టి (తుడుందెబ్బ సీనియర్ నాయకులు )గొప్ప రమేష్, పడిగా రామారావు తదితరులు పాల్గొన్నారు.