కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష...
- బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ ఎంపిటిసి, మాజీ సర్పంచులు..
- అంజి గ్రామంలో నుండి టిఆర్ఎస్ లో యువత చేరిక..
ఉట్నూర్, అక్టోబర్ 13 ( విజయక్రాంతి ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర(Telangana State) సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్(Former Chief Minister KCR) తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఖానాపూర్ నియోజకవర్గం బీ ఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీల నుండి బీ ఆర్ఎస్ పార్టీలో మాజీ ఎంపీటీసీ సభ్యులు,
మాజీ సర్పంచులు చేరారు. ఈ సందర్భంగా యువత తో పాటు మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులతో పాటు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. కెసిఆర్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచిందని కృషి చేశారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కదారి పట్టించి కక్షలను పెంచుకొని అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గూడెంలో, ప్రతి ఒక్కరి గుండెల్లో కెసిఆర్ అధికారంకు రావాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మారుతీ డోంగ్రే, మాజీ కో ఆప్షన్ సభ్యుడు జిలాని బేగ్, బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.