సఖీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన DWO
ఆలేరు, అక్టోబర్ 29 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా సఖీ కేంద్రాన్ని జిల్లా మహిళా సంక్షేమ అధికారి (DWO)(District Women Welfare Officer) గురువారం ఆకస్మికంగా సందర్శించి, కేంద్రంలో అందిస్తున్న సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సఖీ కేంద్రానికి ప్రతి నెలా షెల్టర్ కోసం వస్తున్న కేసుల సంఖ్య, బాధితులకు కల్పిస్తున్న ఆశ్రయం, కౌన్సెలింగ్, వైద్య సేవలు, పోలీసుల సహకారం, న్యాయ సహాయం వంటి అంశాలపై సమీక్షించారు.
బాధిత మహిళలకు అవసరమైన సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. ఇదిలా ఉండగా, గృహహింసకు గురై గత మూడు రోజులుగా సఖీ కేంద్రం షెల్టర్‌లో ఉంటున్న ఓ బాధితురాలికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆమెను భర్త, పిల్లలతో తిరిగి కలిపారు. బాధిత మహిళలకు రక్షణ, భరోసా కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కేంద్రం సిబ్బంది వివరించారు.