జాటోతు హుస్సేన్ నాయక్‌కు పోలీస్ కమిషనర్ మర్యాదపూర్వక కలయిక

29-10-2026 | 10:14pm

బోధన్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): జాతీయ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమిషన్(National Commission for Scheduled Tribes (ST)) సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్‌లోని ఐడీఓసీ కార్యాలయానికి వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌ను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పుష్పగుచ్ఛానికి బదులుగా పువ్వుల మొక్కను అందజేసి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు.

మరిన్ని వార్తలు