వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

29-10-2026 | 10:26pm

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐకెపి అధికారులు సమక్షంలో గ్రామ సర్పంచ్ ధరావత్ భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పూజ చేసి ప్రారంభించారు. ఇందులో ఐకెపి అధికారి భాస్కర్ రెడ్డి, సెక్రటరీ స్వామి, మాజీ సర్పంచ్ కత్తుల సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జింక మల్లేష్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, వ్యవసాయ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు