కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు

29-10-2026 | 12:12pm

కేటీఆర్‌ను బాధపెట్టాలనే ఉద్దేశం లేదు.. కొండా సురేఖ క్లారిటీ

నా వ్యాఖ్యలు తప్పే.. కేటీఆర్‌పై మాట వెనక్కి తీసుకున్న కొండా సురేఖ

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి కొండా సురేఖ(Former Minister Konda Surekha) కీలక ప్రకటన చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని వివరణ ఇచ్చారు. గతంలో చేసిన కొన్ని నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని తాజాగా అంగీకరించారు. కేటీఆర్‌ను లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు.

వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం కూడా లేదని పేర్కొన్నారు. అప్పట్లో చేసిన వ్యాఖ్యల వల్ల కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు గత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసే సమయంలో మాటల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ ఈ పరిణామంతో మరోసారి తెరపైకి వచ్చింది. కొండా సురేఖ తాజా ప్రకటన తెలంగాణ Political Circles‌లో ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటనపై కేటీఆర్ లేదా బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు