మహిళ దెబ్బలు.. దొంగల అబ్బబ్బా..వీడియో చూడాల్సిందే!

29-10-2026 | 06:07pm

సంగారెడ్డి: బంగారు పుస్తెల తాడును లాక్కొని బైక్‌పై పరారవ్వాలనుకున్న ఇద్దరు దొంగలకు ఊహించని షాక్‌ తగిలింది. పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె ధైర్యంగా ఎదురు తిరిగింది. దీంతో వారి ప్లాన్‌ బెడిసికొట్టింది.

మహిళ మెడలోని పుస్తెల తాడును లాక్కునేందుకు ప్రయత్నించిన దొంగలను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తమై అక్కడికి పరుగెత్తుకొచ్చారు. మహిళకు అండగా నిలిచి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఈ క్రమంలో దొంగలకు స్థానికుల నుంచి దెబ్బలు తగిలినట్లు సమాచారం.

బైక్‌పై ఉడాయించాలన్న వారి ప్రయత్నం విఫలమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మహిళ ధైర్యం, రైతుల అప్రమత్తతతో దొంగల ప్రయత్నం విఫలం కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు