పెంట్లవెల్లిని కరువు మండలంగా ప్రకటించాలి

29-10-2026 | 10:14pm

రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై రాస్తారోక

పెంట్లవెల్లి: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి(Pentlavelli)  మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్(BRS) మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెంట్లవెల్లి బస్టాండులో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ పోతుల వెంకటేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 621 మండలాలు ఉంటే 365 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సిగ్గుచేటుగా ఉందని అందులో పెంట్లవెల్లి మండలం రైతులను మంత్రి జూపల్లి పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.

సుమారుగా మండల కేంద్రంలోని 1500 ఎకరాలు సాగు ఉంటుందని నీరు లేక కరెంటు లేక ఎండిపోయిందని వారు ఆరోపించారు. అనంతరం బస్టాండ్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపులాపూర్  సర్పంచ్ మేడిపల్లి సరిత బుచ్చారెడ్డి. పెంట్లవెల్లి సర్పంచ్ మారుపాకుల చిట్టెమ్మ. సింగోరం సర్పంచ్ బాలరాజు. తడకలీ వారి తండా సర్పంచ్ పరశురాముడు. మాజీ రాజేశ్ టిఆర్ఎస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు