నల్ల పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం

29-10-2026 | 10:19pm

తరిగొప్పుల, అక్టోబర్ 29 (విజయక్రాంతి):తరిగొప్పుల మండలం సోలిపూర్ లోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయ(Sri Nalla Pochamma Temple) పునర్నిర్మాణానికి దాతలు అండగా నిలుస్తున్నారు. సుమారు రూ.2 కోట్ల అంచనాతో చేపట్టనున్న ఆలయ నిర్మాణానికి బొబ్బలా మాలతీ సంపత్ రెడ్డి కుటుంబం రూ.10 లక్షల 16 రూపాయల విరాళం అందించి ఔదార్యం చాటింది.

మాటూరు నుంచి నిర్మాణ సామగ్రి తెప్పించేందుకు గురువారం సోలిపూర్, తరిగొప్పుల గ్రామస్థుల సమక్షంలో బొబ్బలా మాలతీ సంపత్ రెడ్డి, ఆమె కుమారుడు, కోడలు బొబ్బలా స్వాతి వసంత్ రామ్ లు ఈ విరాళాన్ని అందజేశారు. గ్రామ దేవత ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తరిగొప్పుల సర్పంచ్ అర్జుల జ్యోతి మధుసూదన్ రెడ్డి, సోలిపూర్ సర్పంచ్ దండెం శ్రీనివాస్, గ్రామస్తులు, ఆలయ పూజారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు