చేనేత సహకార సంఘం ఎన్నికల్లో కర్నాటి వజ్రమ్మ ఘన విజయం
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వజ్రమ్మ, వెంకటేశం దంపతులు
మునుగోడు,అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, న్యూఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కర్నాటి వజ్రమ్మ, వెంకటేశం దంపతులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు తమ విజయాన్ని తెలియజేసి ఆయనను కలిశారు.
విజయం సాధించిన వజ్రమ్మకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి,బండారు చంద్రయ్య, కర్నాటి అశోక్, చిలుకూరి అంజయ్య, పున్న కిషోర్, బావండ్ల శ్రీనివాస్, నారని జగన్, కర్నాటి గిరిప్రసాద్, దోర్నాల నరేందర్, పిశికె రాంబాబు, కర్నాటి శ్రీనివాస్, గంజి కృష్ణయ్య, నేలంటి వెంకటేశం, చెరుపల్లి నాగేష్, కుకుడాల వినోద్, దుబ్బాక మల్లేష్, చిలువేరు అయోధ్య, కర్నాటి విజయ్, హేమంత్ కుమార్ తదితరులు ఉన్నారు.