ఎన్హెచ్ఎం ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలి

29-10-2026 | 10:19pm

కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): ఎన్హెచ్ఎం ఉద్యోగుల(NHM Employees) ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఉద్యోగులకు మద్దతుగా కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం(Karimnagar Collectorate) వద్ద టీడీపీ తరఫున సంఘీభావం తెలపడం జరిగింది. ఎన్హెచ్ఎం  ఉద్యోగుల అధ్యక్షుడు సాగర్  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం టీడీపీ యువ నాయకుడు కళ్యాడపు నరేష్ పటేల్ పాల్గొని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు