రేపు జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన
29-10-2026 | 10:10pm
ఎల్‌నినో ప్రభావంపై జిల్లా స్థాయి సమీక్ష
భూపాలపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు భూపాలపల్లి ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎల్‌నినో ప్రభావంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షకు అధికారులు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై కచ్చితమైన సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకుని హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గత ఏడాది, ప్రస్తుత ఏడాది ఎల్‌నినో ప్రభావానికి సంబంధించిన వివరాలతో పీపీటీ సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.