ఎన్నికలా.. ఏకగ్రీవాల ఆటలా?..బాబుపై జగన్‌ ఫైర్‌!

29-10-2026 | 05:50pm

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల దశలోనే గతంలో ఎన్నడూ చూడని దారుణాలు జరిగాయని ఆరోపించారు. పోలీసుల అండతో అభ్యర్థులపై దాడులు చేశారని, ఎన్నికల అధికారులు (Returning Officers) చంద్రబాబు ఏజెంట్లుగా పనిచేశారని విమర్శించారు.

నామినేషన్‌ పత్రాలను చింపేయడం, నకిలీ సంతకాలతో అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం, బీ-ఫారాలను మాయం చేసి ఏకగ్రీవాలంటూ ప్రచారం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని జగన్‌ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) చర్చకు దారితీశాయి

మరిన్ని వార్తలు