'సనాతన'రక్తదానం

29-10-2026 | 10:21pm

బెల్లంపల్లి: పట్టణంలో సనాతన అనలిటిక్స్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీ సెస్ సంస్థ(Sanatana Analytics and Recruitment Services organization) ఆధ్వర్యంలో గురువారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 60 మంది ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సేవకులు రక్తదానం చేశారు. 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కు అందించారు. ఈ సందర్భంగా సనాతన సంస్థ డైరెక్టర్ ఎర్ర కీర్తన మాట్లాడుతూ సనాతన సంస్థ  ద్వారా సమాజంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా  రక్తదానా కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో తల సేమియా వ్యాధిగ్రస్తులు దాదాపు 800 మంది రక్తం దొరకక నిరంతరం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నన్నారని తెలిపారు. వారిని కాపాడడం బాధ్యతగా భావించి  రక్తదాన శిబిరం నిర్వహించి వారికి అందించేయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సనాతన కోఆర్డినేటర్లు వినోద్, రాజశేఖర్,లలిత్ నూతన్, ఆంజనేయ చారి రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు కాసర్ల శ్రీనివాస్, స్వచ్ఛంద సేవకులు గజెల్లి మోహన్, లక్ష్మీనారాయణ, వేల్పుల రాజేందర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు