ధంతేరస్ వేళ.. పూజకు సరైన సమయం ఇదే!
దేశవ్యాప్తంగా శుక్రవారం ధంతేరస్ (Dhanteras Festival) పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి (Lord Dhanvantari), లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. సంపద, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
సాయంత్రం 6:02 గంటల నుంచి 7:57 గంటల వరకు లక్ష్మీ పూజకు (Lakshmi Puja Muhurat) శుభ ముహూర్తంగా నిర్ణయించారు. కుటుంబ సభ్యులకు అకాల మరణ భయం తొలగి, ఆయురారోగ్యాలు కలగాలని దక్షిణ దిశలో యమ దీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ధంతేరస్ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు, నాణేలు, కొత్త పాత్రలు కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీ కటాక్షం, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.