టెస్ట్ క్రికెట్‌కు షమీ గుడ్‌బై

06-11-2026 | 11:54pm

స్పోర్ట్స్: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతా ద్వారా శుక్రవారం రాత్రి రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఆయన 13 ఏళ్ల Red Ball క్రికెట్ ప్రయాణానికి తెరపడింది. 2013 నవంబర్ 6న వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన షమీ.. తన కెరీర్‌లో 64 మ్యాచ్‌లు ఆడి 229 వికెట్లు పడగొట్టారు. తన వేగం, స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఆయన భారత జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించారు. సరిగ్గా అరంగేట్రం చేసిన రోజే రిటైర్మెంట్ ప్రకటించడం విశేషంగా నిలిచింది.

మరిన్ని వార్తలు