నరకాసుర వధకు పకడ్బందీ ఏర్పాట్లు
- అధికారులు, కమిటీ సమన్వయంతో పనిచేయాలి
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, అక్టోబర్ 29 విజయ క్రాంతి ): దీపావళి సందర్భంగా నవంబర్ 6న వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న ‘నరకాసుర వధ’(Slaying of Narakasura) కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(District Collector Dr. Satya Sharada) అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వేడుకలకు పెద్దసంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మైదానంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.
అగ్నిప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వై.వి. గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీవో సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, డీఎంహెచ్వో రాజిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మారుపల్లి రవి, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల రవి, కోశాధికారి మారుపల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.