తెలంగాణ భాష, యాసను కాపాడిన మహనీయుడు కాళోజి నారాయణరావు

09-09-2026 | 10:00pm

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ

నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా తన కలం ద్వారా ఎన్నో రచనలు చేసి తెలంగాణ భాష,యాసను కాపాడిన మహనీయుడు కాళోజి నారాయణరావు అని నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.నీరజ అన్నారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని బుధవారం కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా కాళోజి నారాయణరావు చిత్రపటానికి అధ్యాపకులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ నీరజ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భాష, యాస, సంస్కృతి, సామాజిక చైతన్యాన్ని తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన కాళోజి సేవలు చిరస్మరణీయమని అన్నారు.

మరిన్ని వార్తలు