ఫామ్‌హౌస్‌లో కుట్ర.. సభను అడ్డుకునే వ్యూహం.!: రేవంత్ రెడ్డి
09-09-2026 | 05:14pm
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు ఫామ్‌హౌస్(Farmhouse)లో కుట్రకు ప్లాన్ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వైఫల్యాలు బయటపడతాయనే భయంతో సభ సజావుగా జరగకూడదని బీఆర్‌ఎస్ వ్యూహం పన్నిందన్నారు. స్పీకర్‌పై మాటల దాడికి పార్లమెంట్, ముంబై, పుల్వామా దాడులకు ఏ మాత్రం తేడా లేదని వ్యాఖ్యానించారు. స్పీకర్ స్థానాన్ని, తల్లిని అవమానించడం సరికాదని, మనం తల్లిని దేవతగా పూజిస్తామని సీఎం అన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులకు స్పీకర్‌పై కోపం ఉన్నట్టుందని పేర్కొన్నారు.