ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజాసమస్యలపై సస్పెన్షన్

09-09-2026 | 01:02pm

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs) సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(BRS leader Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజాసమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్' అని హరీశ్ రావు ఆరోపించారు. తమ సమస్యల గురించి మాట్లాడాలని ప్రజలు అంటున్నారని హరీశ్ రావు సూచించారు. రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ను బయటకు పంపాలని అంటున్నారని తెలిపారు. నియంతృత్వం పెరిగితే ప్రజా తిరుగుబాటు బలపడుతుందని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు