అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

09-09-2026 | 11:44pm

బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) అర్హులైన పేదలకే ఇళ్లు మంజూరు చేయాలని బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్‌(Former BRS Mandal President Gugulothu Krishna Nayak) ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం గరిడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆర్థిక పరిస్థితి, భూమి, ఇతర ఆస్తులు, ఆదాయ వనరులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన లబ్ధిదారుల తుది జాబితాను బహిరంగంగా ప్రకటించాలని కోరారు. నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణ నాయక్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు