గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
బెజ్జూర్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి(development of villages)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్(MPDO Bhandari Praveen Kumar) అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో సర్పంచులు, ఉప సర్పంచ్లు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందరు కలిసి సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల(Indiramma house), ప్రణాళిక తయారీ, క్రొత్త పెన్షన్స్ మంజూరికి దరఖాస్తులు సమర్పణ, వెరిఫికేషన్, జీపీ ఆదాయవ్యాయాలు, త్రాగునీరు, పారిశుధ్యము అన్ని అంశాలపై చర్చించాలని సూచించారు. పనులు చేసినప్పటికీ బిల్లులు రావడం లేదని, రికార్డులు ఉన్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఎంపీడీవో దృష్టికి గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తీసుకువెళ్లారు. బిల్లులు వస్తాయని గ్రామం అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజన్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, సర్పంచులు,ఉప సర్పంచ్లు, కార్యదర్శులు ఉన్నారు.