బీఆర్ఎస్ చర్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Monsoon Session) మూడో కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తలవంపు తెల్చేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మండిపడ్డారు. ఎర్రవల్లి వద్ద దళితులు డప్పులు కొడుతూ నిరసన తెలిపారని పేర్కొన్నారు. దళితులు నిరసన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని మంత్రి పొన్నం ఖండించారు. ఘటనాస్థలిని శుద్ధి చేయడం దళితులు, యావత్ సమాజాన్ని అవమానించడమే అన్నారు.
నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం(Constitution) కల్పించిన హక్కుని పేర్కొన్నారు. ఈ చర్యలు అసమానతలు, శాంతిభద్రతల సమస్యకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ చర్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు.. తలవంచుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను శాసనమండలి తీవ్రంగా ఖండించాలని పొన్నం కోరారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్(KCR Erravalli farmhouse) వద్ద జరిగిన ఘటనపై సభ విచారణం వ్యక్తం చేయాలన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించేది లేదన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పొన్నం సూచించారు.