ముగిసిన శాసన మండలి ఎథిక్స్ కమిటీ సమావేశం

09-09-2026 | 07:18pm

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన శాసన మండలి ఎథిక్స్‌ కమిటీ సమావేశం(Ethics Committee Meeting) జరిగింది. అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభ్యులు చర్చించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను కమిటీ ఖండించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపైనా చర్చించారు. న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మరోసారి సమావేశమై అంశంపై చర్చించాలని కమిటీ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు