దళితులు అడుగు పెడితే ఊరు మైల పడ్డదా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని(Telangana Assembly) మైల మంటలు కుదిపేస్తున్నాయి. నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్(KCR's farmhouse) దగ్గర కాంగ్రెస్ ఎస్సీ నేతలు , కార్యకర్తలు ధర్నా చేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. దళిత సమాజంపై బీఆర్ఎస్ పార్టీ వివక్ష చూపుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Lakshman) ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు అడుగు పెడితే ఊరు మైల పడ్డదా? అని ప్రశ్నించారు. దళితులు వెళ్లారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారని అడ్డూరి లక్ష్మణ్ మండిపడ్డారు. దళితులను బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నిసార్లు అవమానిస్తారని ప్రశ్నించారు. శుద్ధి పేరుతో ఎస్సీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్లూరి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. ఎస్సీలకు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) క్షమాపణ చెప్పాలంటూ మంత్రి మరోసారి డిమాండ్ చేశారు.