చరిత్ర పరిశోధనలో రేగట్టి రాధికకు డాక్టరేట్
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన రేగట్టి రాధిక చరిత్ర విభాగంలో డాక్టరేట్ పట్టా సాధించారు. మంగళవారం హైదరాబాద్‌లోని టాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla), భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా(Bharat Biotech CMD Dr. Krishna Ella), వీసీ ప్రొఫెసర్ కుమార్ మోలుగరం సమక్షంలో ఆమె పట్టా అందుకున్నట్టు గరిడేపల్లి విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు.
గోల్కొండ కుతుబ్‌షాహీల దౌత్య సంబంధాల ప్రభావం క్రీ.శ. 1518–1687’ అంశంపై ప్రొఫెసర్ లావణ్య పర్యవేక్షణలో రాధిక పరిశోధన పూర్తి చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పురుషుల లా కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. డాక్టరేట్ సాధించిన రాధికను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. పరిశోధనకు భర్త రేగంటి అజయ్ అందించిన ప్రోత్సాహం తోనే ఈ విజయం సాధించినట్లు ఆమె తెలిపారు