డైవర్సిన్ రాజకీయాలుమాని - ప్రజాసమస్యలపై చర్చించాలని నిరసన
వ్యక్తం చేసిన జనసేన పార్టీ
చుంచుపల్లి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం(Statue of Dr. BR Ambedkar) దగ్గర జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ పవన కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి డా.గడల శ్రీనివాసరావు ఆదేశం మేరకు కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ(Janasena Party) నాయకులు గత రెండు రోజులు నుంచి అసంబ్లీ సమావేశలలో ప్రజాసమస్యలు వదిలేసి ప్రజాప్రభుత్వం అని చెప్పుతున్న కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు డైవర్సిన్ రాజకీయాలు మాని ప్రజాసమస్యపై చేర్చించాలని నిరసన వ్యక్తం చేసినారు. విద్యార్థులకు ఫీజ్ బకాయులు విడుదల చేయాలని, 22 Aలో ఉన్న భూముల సమస్యలు పరిస్కరించాలి.
రైతులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి,అవినీతిని అరికట్టి పారదర్శక పాలన అందించాలి, కాంగ్రెస్ - బి.ఆర్.ఎస్. వర్గపోరుకు అసెంబ్లీని అడ్డాగా మార్చొద్దు,చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చించాలి, తెలంగాణకు కావాల్సింది రాజకీయ డ్రామాలు కాదు ప్రజాపాలన అని నిరసన వ్యక్తం చేస్తూ... రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఉంటుందని తెలిపినారు. ఈ నిరసన కార్యక్రమంలో సాధిక్ పాషా, మోదుగు జోగారావు, పుదారి. శ్యామ్, అంజి నాయుడు,రాము, సాంభ, సాయి, సంపత్, పాషా, రమేష్, బాలకృష్ణ, పులి, పండు,సురేష్ తదితరులు పాలుగోన్నారు.