సరస్వతి కెనాల్ నీటి విడుదల చేయాలి

09-09-2026 | 10:52pm

నిర్మల్,(విజయక్రాంతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(sriramsagar project) నుండి సరస్వతి కణం ద్వారా నీటి విడుదల చేసి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ హరి రావు విన్నవించారు. బుధవారం హైదరాబాద్ వెళ్ళి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని కలిసి సరస్వతి కెనాల్ కు నీలను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. దీనికి స్పందించిన వారు వారం రోజుల్లో నీళ్లు విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నరేష్ రెడ్డి బాపయ్య మహమ్మద్ రఫీ ఉన్నారు.

మరిన్ని వార్తలు