సురేపల్లి సుజాతకు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా బాధ్యతలు

09-09-2026 | 10:58pm

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University) అకడమిక్ ఆడిట్ సెల్ నూతన సంచాలకులుగా ఆచార్య సురేపల్లి సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్, విసి ఓఎస్డి డా. హరికాంత్ సమక్షంలో ఆమెకు బాధ్యతల పత్రాన్ని అందజేసి, అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాల మెరుగుదలకు, అకడమిక్ కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణకు తన వంతు కృషి చేస్తానని ఆచార్య సురేపల్లి సుజాత పేర్కొన్నారు. ఆమె విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం సమాజ శాస్త్ర విభాగాధిపతిగా, యూజీసీ అఫైర్స్ నోడల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.విశ్వవిద్యాలయ వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు