పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
కోదాడ అక్టోబర్ 24(విజయ క్రాంతి): పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాలు–2026(Police Flag Day Week Celebrations–2026), పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి(Kodad DSP Srinivas Reddy) శనివారం కోదాడ పట్టణంలో నివసిస్తున్న పోలీసు అమరవీరుడు కానిస్టేబుల్ శీలం కమలాకర్(Constable Sheelam Kamalakar) కుటుంబ సభ్యులను వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... గత సంవత్సరం నవంబర్ నెలలో నాగారం పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న శీలం కమలాకర్ ను కారు దికొనడంతో అమరులయ్యారని గుర్తుచేశారు. విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎస్ఐ మల్సుర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి కిరణ్, అమర పోలీసు కమలాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.