ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి

24-10-2026 | 10:20pm

* ఎమ్మెల్యే కసిరెడ్డి

​ఆమనగల్లు, అక్టోబర్ 24(విజయక్రాంతి): వ్యవసాయంలో(Agriculture) నీటి వినియోగాన్ని తగ్గిస్తూ రైతులు ఆరుతడి పంటలు సాగు(Farmers cultivate wet crops) చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి(MLA Kasireddy Narayana Reddy) సూచించారు. శనివారం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి రైతు వేదికలో సర్పంచ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడారు.

​ఎల్ నినో ప్రభావంతో(impact of El Niño) వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా రైతులు(Farmers) ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే స్ప్రింక్లర్లు, డ్రిప్ వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,

డైరెక్టర్  శ్రీశైలం, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మహేష్, శ్రీకాంత్, సురేష్ మరియు స్థానిక రైతులు, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు