కోహెడ గ్రామ పంచాయతీ కార్యాలయం
ప్రైవేటు సమావేశాలకు వేదికైంది
* బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం
కోహెడ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): కోహెడ గ్రామ పంచాయతీ భవనం(Koheda Gram Panchayat Building) ప్రైవేట్ సమావేశాల నిర్వహణ కు వేదికగా వినియోగించడం చట్టా విరుద్ధం మని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం(Khammam Venkatesham) అన్నారు. కోహెడ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగిందన్నారు. కార్యదర్శి అనుమతి లేకుండా ప్రైవేట్ సమావేశాలు(Private meetings) ఎవరి అనుమతి తో జరిగినట్లు గ్రామ ప్రజల కు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా నిర్వహించడం శోశనీయం అన్నారు.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 43 పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలను వివరిస్తుండగా సెక్షన్ 51 గ్రామ పంచాయతీల పరిపాలనపై పర్యవేక్షణ, తనిఖీ అధికారాలను నిర్దేశిస్తుందని గుర్తు చేశారు. ఈ నిబంధనల నేపథ్యంలో కోహెడ గ్రామ పంచాయతీ భవనాన్ని ఇతరుల సమావేశానికి ఉపయోగించిన విధానం చట్ట విరుద్ధం అన్నారు.
కాగా ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శక పాలన అందిస్తామని చెప్పే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటన పై స్పందించాలని డిమాండ్ చేశారు. బాద్యులైన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.