ఎన్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీలో పారదర్శకత

24-10-2026 | 10:21pm

40 పోస్టులకు దరఖాస్తుల పరిశీలన

ఇప్పటివరకు 62 అభ్యంతరాల స్వీకరణ

ఆసిఫాబాద్‌,(విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (National Health Mission) విభాగంలో వివిధ కేడర్లకు సంబంధించిన 40 పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సిడం నాగేంద్ర(DMHO Dr. Sidam Nagendra) తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా, అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని పేర్కొన్నారు. దరఖాస్తులపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 26వ తేదీలోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

ఇప్పటివరకు 62 అభ్యంతరాలు స్వీకరించినట్లు వెల్లడించారు. అర్హతలు, మెరిట్‌, నిబంధనల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని హెచ్చరించారు. నియామకాలకు సంబంధించిన అధికారిక సమాచారం, తదుపరి ప్రక్రియ వివరాల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఎంహెచ్‌వో  సూచించారు.

మరిన్ని వార్తలు