లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ వైద్య శిబిరంకు స్పందన
కాగజ్నగర్, అక్టోబర్ 24 (విజయ క్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్(Kagaznagar Railway Station) ఆవరణలో ఇంపాక్ట్ ఇండియా లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్(Impact India Lifeline Express) వైద్య శిబిరానికి(medical camp) ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈనెల 16వ తేదీన ప్రారంభమైన వైద్య శిబిరం శనివారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(Dr. Harish Babu) ఆధ్వర్యంలో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్ల కోసం దాదాపు 500 మంది పేషెంట్లు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఈ వైద్య శిబిరంలో కంటి, చెవి, ఎముకలు, డెంటల్ ,ప్లాస్టిక్ సర్జరీ, స్త్రీలకు సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నారు.