స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

25-09-2026 | 05:11pm

సర్పంచ్ కవిత రవి

మోతె, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): మండల పరిధిలోని బురకచర్ల గ్రామానికి మంజూరైన811 స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ ధరావత్ కవిత రవి    శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ కవిత రవి, మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు రేషన్ కార్డు  పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ పథకాలకు అర్హత నిర్ధారణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.స్మార్ట్ రేషన్ కార్డుల విధానం ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు.అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసాని మధు, గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మరబోయిన గోపి, డీలర్లు గోపాలు, కొండ పిచ్చయ్య, పార్టీ సీనియర్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, ఉప్పునూతల భద్రయ్య, గ్రామ కార్యదర్శి రవీందర్, జిపిఓ జహంగీర్, సురేందర్ రెడ్డి, నరసింహారెడ్డి,ఉమేష్, గంగయ్య, పరమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు