ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి
ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో(Ghatkesar town) డివిజన్ బిజేపీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి(Kommidi Mahipal Reddy) ఆధ్వర్యంలో శుక్రవారం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని(Pandit Deendayal Upadhyaya Jayanti program) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
అంత్యోదయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను(Service activities) ముందుకు తీసుకెళ్దాం అని వారి ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్, బీజేపీ సీనియర్ నాయకులు కాలేరు రామోజీ, పల్లె మధు, ఓబీసీ మోర్చా బాల నర్సింహా, మహిళా మోర్చా మాధవి, బూత్ అధ్యక్షులు మెరుగు నర్సింహా రెడ్డి, కిరణ్ కుమార్, తన్నీరు వెంకటేష్, గుట్టప్ప, కాలేరు పరశురాలు పాల్గొన్నారు.