సహకార సంఘ సభ్యుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత
- మాజీ సెక్రటరీ మామిడాల అశోక్ కుమార్ మృతికి సంతాపం
- మంథని సర్వ సభ్య సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Agricultural Cooperative Society) సభ్యుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kotha Srinivas) అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి.,మంథని కార్యాలయంలో 89 సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ సభ్యులు, రైతులకు అవసరమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు వంటి వివిధ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
రైతులకు సకాలంలో అవసరమైన సహకారం అందిస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సహకార సంఘం అభివృద్ధి చెందితే సభ్యులు, రైతులకు మరిన్ని ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందని, అందుకు పాలకవర్గం, సిబ్బంది, సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సంఘం ద్వారా గత రబీ సీజన్ లో ఎక్కడ లేని విధంగా అత్యధికంగా 36 కేంద్రాలు నిర్వహించి 5,05,585 క్వింటాల్ల ధాన్యం కొనుగోలు చేసి జిల్లాలో, రాష్ట్రంలో ప్రథమ స్థానం లో నిలిచామని అన్నారు.
అంతే కాకుండా ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్, సహకార అధికారి సహకారం తో గుంజపడుగు శివారు లో రూ.3.40 కోట్లతో పిఎం కుసుమ్ ద్వారా సౌర విద్యుత్ ను ప్రోత్సహించేందుకు సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. తద్వారా సంఘానికి రూ.51 లక్షల ఆదాయం సమకూరనుందని అన్నారు. ఈ సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు, గోనె సంచుల సమస్య రాకుండా తగు చర్యలు చేపడుతున్నామని, ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లల కు తరించేలా తగు పకడ్భంది ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో పూర్తి జవాబుదారి తనంగా వ్యవహరిస్తామని, రైతుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపడుతామని అన్నారు. గత సీజన్ లో జరిగిన ఇబ్బందులు మళ్ళి పునరావుతం కాకుండా చూసుకుంటామని అన్నారు. ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో రైతుల కు ధాన్యం లో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోళ్ళు చేపడుతున్నామని అన్నారు.
టీజీఈఆర్సి సలహాదారు శశి భూషణ్ కాచే మాట్లాడుతూ స్వాతంత్ర్య, సహకార ఉద్యమ కాలంలో కొంత మంది వ్యక్తులు తమ ఆస్తులు, డబ్బులు దారాదత్తం చేసి సంస్తలను కాపాడుకున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలో మెట్ పల్లి, వావిలాల చేనేత సహకార సంఘాలు కాల గమనం లో నిర్వహణ లోపాల మూలంగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారు చేపట్టిన రుణ మాఫి లాంటి సంస్కరణల వల్ల రైతుల రుణాలు మాఫీ అయ్యాయని, సకాలం లో రుణాలు చెల్లించిన వారికి రూ.5 వేల ఇన్సెంటివ్ అందిచారని గుర్తు చేశారు.
తద్వారా రైతులకు ఆర్ధిక భరోసా అందటం తో పాటు సంఘాలు ఆర్థికంగా నిలదొక్కు గలిగాయని అన్నారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి బొద్దుల సమ్మయ్య సంఘ జమ ఖర్చులు పట్టిక చదివి వినిపించారు. అలాగే సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సమాధానాలు ఇచ్చారు. ముందుగా సంఘ మాజీ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ అకాల మృతి కి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.
ఈ సమావేశంలో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి – పర్వతాల్ యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, సర్పంచులు తోటపల్లి పోచయ్య, సంగెం సరోజన- గట్టయ్య, న్యాతరి లతా-శ్రీనివాస్, గుమ్మడి సమ్మయ్య, సంధ్య-భానేష్, జాడి రామస్వామి, మాజీ ఎంపిపి కొండ శంకర్, సంఘ మాజీ డైరెక్టర్ ఇనుముల సతీష్, నాయకులు బెజ్జంకి డిగంబర్, వేల్పుల గట్టయ్య, తిరుపతి, సబ్బని సంతోష్, పెద్ద సంఖ్యలో సభ్యులు, రైతులు,సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.