చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీకి మరో ఘనత
భద్రాచలం( విజయ క్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association)(HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-16 స్టేట్ ప్రాబబుల్స్కు కు భద్రాచలంచేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ నుంచి ఐదుగురు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఎంపికయ్యారు. అకాడమీ నుంచి జూపల్లి దిరాజ్, ప్రసన్న కుమార్, ఉజ్వల్ గణేష్, దీపక్ నాయక్, సాయి చంద్ర స్టేట్ ప్రాబబుల్స్‌కు ఎంపికై తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు.
రేపటి నుంచి జరగనున్న ప్రాబబుల్స్ మ్యాచ్‌లలో ఈ ఐదుగురు ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి HCA అండర్-16 రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ కోచ్ శరత్ తేజ మార్గదర్శకత్వంలో నిరంతరం కష్టపడి సాధన చేస్తున్న ఈ యువ క్రికెటర్ల ఎంపిక అకాడమీకి ఎంతో గర్వకారణంగా నిలిచింది. యువ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడంలో అకాడమీ చేస్తున్న కృషికి ఇది మరో నిదర్శనం.
రాబోయే మ్యాచ్‌లలో ఐదుగురు ఆటగాళ్లు తమ సత్తా చాటి, రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాలని చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.