ఆదివాసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి

12-09-2026 | 06:43pm

క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్‌ను పటిష్టం చేయాలి:బండి శివకుమార్

సిద్దిపేట, రూరల్,సెప్టెంబర్‌ 12 (విజయక్రాంతి): తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల ఎస్టీ సెల్‌ అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా ఆసిఫాబాద్‌, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా, తాలూకా స్థాయి పదవులపై ఆదివాసీ నాయకులకు అవగాహన కల్పించి దరఖాస్తు ఫారాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా బండి శివకుమార్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి ఆదివాసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, ముద్దాం లక్ష్మి, కలిముద్దీన్‌, గారిపల్లి రాములు, గణేష్‌ రాథోడ్‌, కొదాది రమేష్‌, గ్యార రఘుపతి, మహిపాల్‌రెడ్డి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు